దసరా బరిలో లయన్ Vs టైగర్....!!

murali krishna
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో ఉన్న సీనియర్ స్టార్ హీరో ల్లో నందమూరి బాలకృష్ణ కు ఉన్నా క్రేజ్ గూర్చి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇటీవల సంక్రాంతికి 'వీరసింహారెడ్డి'గా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న బాలకృష్ణ విజయదశమి కి తన కొత్త సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ శరవేగం గా షూటింగ్ జరుగుతోంది. ఉగాది సందర్భంగా బాలయ్య ఫస్ట్‌లుక్‌తో అంచనాలు పెంచిన టీమ్ శుక్రవారం సినిమా రిలీజ్‌ డేట్ ‌ని ప్రకటించి ఫ్యాన్స్‌ ని మరింత ఖుషి చేసింది.
'విజయదశమికి ఆయుధ పూజ' అని అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ ‌ను రిలీజ్ చేశారు. ఇందు లో ఇంటెన్స్ లుక్ ‌లో కనిపిస్తున్నారు బాలకృష్ణ. పోస్టర్ ‌లో కాళీమాత విగ్రహం కూడా కనిపించడంతో ఈ సినిమా లో బాలయ్య ను పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ లో చూపించబోతున్నట్టు అర్ధమవుతోంది. బాలకృష్ణ నటిస్తోన్న 108వ సినిమా ఇది.
కాజల్ అగర్వాల్ హీరోయిన్‌. శ్రీలీల ఇంపార్టెంట్ రోల్‌ పోషిస్తోంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే రవితేజ 'టైగర్ నాగేశ్వర రావు'తో పాటు రామ్, బోయపాటి కాంబోలో తెర కెక్కుతోన్న చిత్రం కూడా దసరా బరి లో ఉన్నాయి.
ఐతే డైరెక్టర్ అనిల్ మరియు స్టార్ హీరో బాలయ్య కాంబో మీద అభిమానులు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇదిలా ఉంటే మరీ ఈ దసరా కి వాళ్ళ ప్రాజెక్ట్ కి పోటీగా రవితేజ అలాగే మాస్ డైరెక్టర్ మరియు ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబో కూడా విడుదలకు సిద్ధం గా ఉంది. ఐతే ఆ బరిలో నుండి ఏ మూవీ అనేది తప్పుకుంటుందో వెయిట్ చేసి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: