బాలయ్య కేరిర్ లోనే భారీ వ్యయంతో కూడిన సాంగ్ అదేనా...!!

murali krishna
టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి 'వీరసింహారెడ్డి'గా సందడి చేసి అందరిని అలరించినా బాలకృష్ణ ఇప్పుడు దసరా బరిలో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం ఆయన హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం లో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తం గా నిర్మిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది.ఐతే ఈ మూవీ ఫాదర్ మరియు డాటర్ బాండింగ్ తో తెరకేక్కుతుందని సినీ వర్గాలు చెప్పు కుంటున్నాయి. ఐతే ఇటీవల ఈ సినిమా కు సంబంధించి బాలయ్య బాబు న్యూ లుక్ ను కూడా మూవీ టీం విడుదల చేసింది. దాన్ని చూసిన అభిమానులు చాలా సంతోష పడ్డారు. బాలయ్య బాబు ఆ న్యూ లుక్ లో సూపర్ అని కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు అందుకున్నారు.

ఐతే ఈ సినిమాలో భాగంగా ప్రస్తుతం ఈ సినిమా కోసం రూ.5కోట్ల ఖర్చు తో ఓ పాటను తెరకెక్కిస్తోంది చిత్ర బృందం. గణేశుడిపై సాగే ఈ గీతం కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ భారీ సెట్‌ ను సిద్ధం చేశారు. ఇప్పుడా సెట్‌లోనే బాలయ్య, శ్రీలీలపై ఎంతో గ్రాండ్‌గా ఈ పాటను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

ఐతే ఈ సాంగ్ చిత్రికరణ లో తెల్సింది ఏంటంటే బాలకృష్ణ కెరీర్‌ లోనే అత్యధిక వ్యయంతో తెరకెక్కుతున్న పాట ఇదని, తమన్‌ బాణీలు, శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. మాస్‌ యాక్షన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా ముస్తాబవుతున్న ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: సి.రామ్‌ప్రసాద్‌.

ఐతే ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందని ఆయన అభిమానులు వెయ్యి కళ్ళ తో ఎదురు చూస్తున్నారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని మూవీ టీం అంటున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: