రాజా వారు రాణి గారు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొట్ట మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ హీరో ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం అనే రొమాంటిక్ లవ్ కామెడీ ఎంటర్టైలర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన పాటలు , ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
అలా మంచి అంచనాల విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ తో కిరణ్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో భారీగా పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ తర్వాత అనేక మూవీ లలో నటించిన ఈ హీరో కు సమ్మతమే ... వినరో భాగ్యము విష్ణు కథ మూవీ లతో మంచి విజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో మీటర్ అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.
ఈ మూవీ రేపు అనగా ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. రవి ఆతుల్య ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... రమేష్ కాడూరి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సాయి కార్తీక్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను ఇప్పటికే ఈ చిత్ర బృందం క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ 4.50 కోట్ల షేర్ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే ఈ మూవీ హిట్ గా నిలుస్తుంది.