ఆ స్టార్ డైరెక్టర్ నన్ను కమిట్మెంట్ అడిగాడు.. తేజస్వి మడివాడ షాకింగ్ కామెంట్స్..??

Anilkumar
మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒకప్పటిలా అసలు లేదు. ఇప్పుడు చాలా మారిపోయింది. ఒకప్పుడు టాలెంట్ చూసి సినిమాల్లో అవకాశాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం కమిట్మెంట్స్ ఇస్తున్న వాళ్లకే ఆఫర్స్ ఇస్తున్నారు. ఒకప్పటితో పోల్చుకుంటే సినీ ఇండస్ట్రీలో వచ్చిన ప్రత్యేకమైన మార్పు ఇదే. ఒకప్పుడు బాలీవుడ్ లో ఈ కమిట్మెంట్స్ ట్రెండ్ బాగా ఉండేది. కానీ అది ఇప్పుడు టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. మరో వైపు అటు మీటు ఉద్యమం తర్వాత చాలామంది ఫిమేల్ ఆర్టిస్టులు బయటకొచ్చి మరి వీటిపై స్పందిస్తున్నారు. అయితే తాజాగా ఇదే క్రమంలో తేజస్వి మడివాడ కూడా స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 


తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్వి మాట్లాడుతూ..' నేను సినీ ఇండ్రస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కాస్టింగ్ కౌచ్ ఉంటుందని అసలు అనుకోలేదు.నా కెరియర్ స్టార్టింగ్ లో నన్ను కూడా ఓ డైరెక్టర్ కమిట్మెంట్ అడిగాడు. ఓ సినిమాలో నాకు హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా డైరెక్టర్ మేనేజర్ నా దగ్గరికి వచ్చి డైరెక్టర్ అప్పుడప్పుడు మీ రూమ్ కి వస్తారు. అప్పుడు మీరు అడ్జస్ట్ అవ్వాలి అని నాతో డైరెక్ట్ గా చెప్పాడు. అప్పుడు నాకు అసలు విషయం అర్థమైంది. దాంతో నేను అందుకు నో చెప్పాను. ఆ తర్వాత సినిమా నుంచి హీరోయిన్ గా తప్పుకున్నాను. ఇప్పటికీ కూడా ఆ డైరెక్టర్ కొన్ని సినిమాలు చేస్తున్నాడు.


నేను మాత్రం కేవలం నా టాలెంట్ ని నమ్ముకొని పైకి వచ్చాను. ఇప్పటికీ నాకు ఆఫర్స్ వస్తున్నాయి. ఇక నాలాగే మన తెలుగు అమ్మాయిలు కూడా చాలా మంది ఇలాగే క్యాస్టింగ్ కౌచ్ కి గురవుతున్నారు" అంటూ తేజస్వి మడివాడ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చిన్న చిన్న సినిమాల్లో అలాగే పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ఇక ఇటీవల మాటీవీ ప్రసారమైన బీబీ జోడీలో అఖిల్తో కలిసి డాన్స్ ఇరగదీసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా తేజశ్రీ తన హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: