సూర్య -42 సినిమా నుంచి అప్డేట్ ..!!

Divya
కోలీవుడ్ ,టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను అందుకొని స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగారు హీరో సూర్య. తెలుగు ప్రేక్షకులను కూడా పలు సినిమాలతో బాగానే అలరించారు.ఇక్కడ కూడా సూర్యకు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. సూర్య మొదటిసారి పీరియాడికల్ మూవీ లో నటించబోతున్నారు. ఈ సినిమా 42వ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్ యు వి క్రియేషన్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో ఈ సినిమాని మొదలుపెట్టాడం జరిగింది. సూర్య 42వ తమిళ మూవీ గా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.


ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ నటిస్తున్నట్లు తెలుస్తోంది.సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. పునర్జన్మ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది ఇప్పటికి ఎంతోమంది ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాలో సూర్య అయిదు విభిన్నమైన పాత్రలలో నటిస్తున్నట్లుగా సమాచారం ఏకంగా ఈ సినిమా ఒకేసారి పది భాషలలో త్రీడీలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 16వ తేదీన ఈ సినిమాకి సంబంధించి టైటిల్ విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సూర్య కెరియర్ లోని ఈ సినిమా భారీ బడ్జెట్ చిత్రమే కాకుండా అత్యధిక భాషలలో విడుదల చేస్తున్న సినిమాగా పేరుపొందింది ఈ సినిమా కోసం తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సూర్య ఇప్పటివరకు తన కెరియర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించారు ఇప్పుడు కూడా ఒక యోధుడి పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్ వీడియో అందరిని ఆకట్టుకుంది. మరి ఈ సినిమా టైటిల్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: