చిరు -మోహన్ బాబు కాస్త స్నేహం గానే కనిపిస్తారు .. అయితే గత ఏడాది కూడా పవన్ ..మోహన్ బాబు పై కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు . తన మేనల్లుడి
మూవీ ఈవెంట్ లో
ఇండస్ట్రీ మొదలుకొని రాజకీయాల వరకు పవన్ ఆసక్తికర వ్యాఖ్యల ను చేశారు.. సీనియర్ నటుడు
మోహన్ బాబు,
ఏపీ సీఎం
జగన్ మోహన్ రెడ్డి బంధువేనని..
సినిమా పరిశ్రమ ఇబ్బందులను ఆయన
జగన్ మోహన్ రెడ్డికి చెప్పాలని కూడా అన్నారు. పవన్ వ్యాఖ్యలపై
మోహన్ బాబు అప్పట్లో ఘాటుగానే స్పందించారు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్. సంతోషమే అంటూ నువ్వు అడిగిన ప్రతి మాటకి నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను అని చెప్పుకుకొచ్చారటా... ఇదే సమయంలో మంచు
మోహన్ బాబు తనయుడు
మంచు మనోజ్ కి పవన్
కళ్యాణ్ పార్టీలోకి వెళతారని ప్రచారం కూడా సాగింది.
తిరుపతి నియోజకవర్గం నుండి మనోజ్ పవన్
పార్టీ నుంచి పోటీ చెయ్యబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి .. అయితే ఆ తర్వాత అవి గాసిప్స్ అని అర్ధం అయింది .. ఇక ఇప్పుడు పవన్
కళ్యాణ్ పై
మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారటా... పవన్ తనకి మంచి మిత్రుడని చెప్పుకొచ్చారు .. ఇటీవల
మోహన్ బాబు వరుసగా ఇంటర్వ్యూ లు కూడా ఇచ్చారు ..అందులోనే పవన్ గురించి ఆయన మాట్లాడారు . పవన్
కళ్యాణ్ పిలువాలేగాని ఏ పాత్ర ఇచ్చిన చేస్తా అని కూడా చెప్పారు ..మరి
జనసేన కి సపోర్ట్ చేస్తారా అంటే మాత్రం సూటిగా అయితే చెప్పలేదు ..సినిమాలు రాజకీయాలు వేరని ఆయన చెప్పుకొచ్చారు . మొత్తంగా
మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ..పవన్ అంటే తనకు ఇష్టం అని చెప్పడంతో మెగాభిమానులు కూడా
ఖుషి అవుతున్నారు…