ఇటీవల 'వీర సింహారెడ్డి' చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 'NBK 108' అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలయ్య కి జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గార పాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో పెళ్లి సందడి బ్యూటీ శ్రీ లీలా కనిపించనుంది. తండ్రి కూతుర్ల అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ ను అందించారు మేకర్స్. తాజాగా ఎన్బికె 108 లో నందమూరి బాలకృష్ణ పై హై ఎనర్జిటిక్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు అనిల్ రావిపూడి.ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో ఈ పాట రూపొందుతుంది. శ్రీ రాంప్రసాద్ కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురు సెట్ లో ఉన్న ఓ ఫోటోను దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ఇటీవల ఈ సినిమా షూటింగ్లో కాజల్ అగర్వాల్, శ్రీ లీల జాయిన్ అయిన సంగతి తెలిసిందే. తండ్రి, కూతురు మధ్య సెంటిమెంటుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో..
శ్రీ లీలకు బాబాయి పాత్రలో బాలయ్య నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సినిమాలో వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయట. బాలయ్య నటించిన నిప్పురవ్వ సినిమా తర్వాత కంప్లీట్ తెలంగాణ నేటివిటితో ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే ప్రకటించాడు. సినిమాలో బాలయ్య మార్క్ యాక్షన్ తో పాటు తన మార్క్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని అన్నారు దీంతో మొదటిసారి వీరి కాంబోలో సినిమా తెరకెక్కనుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మరోసారి ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న తరహా పాత్రలను పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది...!!