HBD: అల్లు అర్జున్ ఇలా చూస్తే థియేటర్లో దద్దరిల్లాల్సిందే..!!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పుష్ప రాజ్.. పుష్ప కు సంబంధించి ఎలాంటి సన్నివేశాలైన సరే వైరల్ గా మారుతున్నాయి. పుష్ప షాట్ ది రూల్ పై భారీగా అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు సినీ ప్రేక్షకులకు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అల్లుఅర్జున్ బర్తడే సందర్భంగా నిన్నటి రోజున విడుదలైన పుష్ప-2 టీజర్ భారీ అంచనాలను పెంచేస్తోంది.
మాస్ అవతారంలో అల్లు అర్జున్ లుక్ ను చూసి అభిమానులు ఫుల్ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఆడియన్స్ అంచనాలను మించి టీజర్ ఉండడంతో ఈ సినిమా మరింత హైప్ ను తీసుకువస్తోంది ..ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో పుష్ప రాజ్ ఫోటో మాత్రం ఒకటి వైరల్ గా మారుతోంది.. ఈ ఫోటో చూసి ఒక్క నిమిషం అలాగే ఆగిపోయేలా చేస్తోంది. అల్లు అర్జున్ ని ఎప్పుడు చూడని విధంగా అందరిని ఆశ్చర్యపరిచేలా చేస్తోంది ఈ పోస్టర్.. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ మూడు నిమిషాల 14 సెకండ్ల వీడియో గ్లింప్ కంటే సోషల్ మీడియాలో ట్రెండీగా అవుతుంది ఈ ఫోటో.
అయితే ఈ ఫోటోలు ఏముందంటే అల్లు అర్జున్ ఉగ్రరూపదారి అయిన గంగమ్మ రూపంలో మారిన ఒక ఫోటో తెగ వైరల్ గా మారుతోంది ..పట్టుచీర కట్టుకొని ముక్కుపుడక, బుట్ట కమ్మలు చేతికి ఎర్ర రంగు గాజులు మెడలో బంగారు గొలుసు, నిమ్మకాయల దండ ఇలా అన్నిటిని మించి ఈ ఫోటో చాలా హైలెట్ గా మారుతోంది. ఇక పుష్ప-2 కాన్సెప్ట్ టీజర్ అత్యంత పాజిటివ్ వైపున అందిస్తున్న ఈ సినిమా కేజిఎఫ్ -2 కి ఎంతటి హైపి ఏర్పడిందో ఇక్కడ కూడా అలాగే కనిపిస్తోంది. కే జి ఎఫ్ చిత్రంలో రాఖీ భాయ్ చుట్టుపక్కల ప్రజల కోసం ఇళ్లను నిర్మించారు.. అయితే సుకుమార్ ఈ చిత్రంలో క్రియేటివిటీ కొంత ఈ సినిమాకి చాలా ప్రత్యేకంగా ఉందని చెప్పవచ్చు..