బలగం సూపర్ హిట్.. రేటు అమాంతం పెంచేసిన ప్రియదర్శి?
గతంలో మల్లేశం అనే సినిమా తో విజయాన్ని సాధించిన ప్రియదర్శి ఇక ఇటీవల బలగం సినిమా తో సెన్సేషన్ సృష్టించాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా లో తన నటన తో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. సాధారణం గా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చిందంటే చాలు రెమ్యూనరేషన్ అమాంతం పెంచేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు అందరి బాట లోనే అటు ప్రియదర్శి కూడా తన పారితోషకాన్ని పెంచేశాడు అన్నది మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారి పోయింది. ఏకంగా హీరోగా ప్రియదర్శిని తీసుకోవాలి అంటే మాత్రం రెండు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ చెల్లించాల్సిందేనట.
అయితే ఇంత పెద్ద మొత్తం అటు ప్రియదర్శి మార్కెట్కు కాస్త ఎక్కువే అయినప్పటికీ.. ప్రస్తుతం అతనికి ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఇక రెండు కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అయితే బలగం సినిమా తర్వాత ఎలాంటి పాత్రలో నటించిన ప్రియదర్శి పూర్తిస్థాయి న్యాయం చేస్తాడని ఇటీవల కాలంలో ఎంతోమంది విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. అంతేకాదు ఎవరైనా కొత్త దర్శకుడు వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు అంటే చాలు వారికి మొదటి ఆప్షన్ గా ఇప్పుడు ప్రియదర్శి మారిపోయాడు అని చెప్పాలి. ఇలాంటి టాలెంట్ ఉన్న నటులు ఇండస్ట్రీకి మరికొంతమంది అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.