యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... రత్నవేలు ఈ సినిమాకి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. అనిరుద్ రవిచంద్ర ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ప్రస్తుతం ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ నిర్వహిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. ఈ మూవీ కోసం చాలా మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పని చేయనున్నారు. ముఖ్యంగా ఈ మూవీ లోని యాక్షన్స్ సన్ని వేషాలను హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లు కొరియో గ్రఫీ చేయబోతున్నారు.
ఈ మూవీ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ యప్షన్ సన్నివేశాలు ఈ మూవీ కే హైలైట్ గా నిలవనునట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ తాజాగా పూర్తి అయినట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ తాజాగా పూర్తి అయినట్లు సమాచారం. మొదటి షెడ్యూల్లో భాగంగా మూవీ లోని కొన్ని కీలక సన్నివేశాలను ఈ మూవీ యూనిట్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది.