సినీ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో నటించిడమే గొప్ప అనుకుంటే.. ఇప్పుడు ఓ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఓ భారీ బిజినెస్ ని ప్లాన్ చేస్తున్నారట. మరి ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమా చేస్తే దాన్ని మల్టీ స్టారర్ సినిమా అంటారు. అదే బిజినెస్ చేస్తే బహుశా మల్టీ స్టారర్ బిజినెస్ అంటారేమో! ఇంతకీ ఎవరా స్టార్ హీరోలు? అనే పూర్తి వివరాలకు వెళితే.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే బాలీవుడ్ అగ్ర హీరో అమితాబచ్చన్ ఇద్దరు కలిసి ఓ సరికొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో అమితాబచ్చన్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ పలు హిట్స్ సినిమాలతో తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
ఇక ఒకప్పటి ప్రపంచ సుందరి అయినా ఐశ్వర్యరాయ్ ని పెళ్లి చేసుకున్న అభిషేక్ బచ్చన్ తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే. ఇక గత ఏడది పుష్ప సినిమాతో బాలీవుడ్ ని షేక్ చేసిన అల్లు అర్జున్ కి ఇప్పుడు ఇక్కడ భారీ మార్కెట్ ఉంది. అయితే ఈ ఇద్దరు హీరోలు కలిసి ఇప్పుడు ఒక సరికొత్త బిజినెస్ ను మొదలుపెట్టబోతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్, అభిషేక్ బచ్చన్ కలిసి ఒక స్పోర్ట్స్ బిజినెస్ లో భాగం కాబోతున్నారట. ఇప్పటికే అభిషేక్ బచ్చన్ ప్రముఖ కబడ్డీ టీమ్ అయిన జైపూర్ పింక్ పాంథర్స్, అలాగే చెన్నయిన్ ఎఫ్ సి అనే ఫుట్బాల్ టీంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు.
ఇటు అల్లు అర్జున్ కూడా ఏషియన్ వారితో కలిసి సత్యం థియేటర్ ని మాల్ గా మార్చేశాడు. ఇక ఇప్పుడు అభిషేక్ బచ్చన్ తో కలిసి అల్లు అర్జున్ స్పోర్ట్స్ బిజినెస్ చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ బిజినెస్ కు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప2 సినిమా చేస్తున్నాడు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా నుండి ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ని అందుకుంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు...!!