బన్నీ కి సీక్రెట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందనే విషయం మీకు తెలుసా..?

Anilkumar
సోషల్ మీడియా కాలం వచ్చినప్పటి నుంచి మన సినీ సెలబ్రిటీలు ఏం మాట్లాడినా, ఏం చేసినా అవి క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వాళ్ళకి విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ఇక మన టాలీవుడ్ అగ్ర హీరోలకు సోషల్ మీడియాలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది వెంటనే వైరల్ అవుతుంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి విషయాలను బయటకి అస్సలు చెప్పరు. దాన్ని చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తారు. ముఖ్యంగా ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయడం సెలెబ్రెటీలకు ఎంతో కష్టంగా ఉంటుంది. 

అలాంటి స్టార్ సెలబ్రిటీలు కొందరు నకిలీ సోషల్ మీడియా అకౌంట్స్ ని ఓపెన్ చేస్తుంటారు. అలా మన టాలీవుడ్ లో తాజాగా ఓ స్టార్ హీరోకి కూడా అలాంటి ఒక ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ అగ్ర హీరో మరెవరో కాదు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా అల్లు అర్జున్ ఓ ఫేక్ అకౌంట్ ను ఓపెన్ చేశారట. ఆ అకౌంట్ కు సంబంధించిన బయోలో 'పోస్ట్ థాట్లేస్లీ' అని రాసి ఉంది. ఇక ఈ అకౌంట్ ను బన్నీ భార్య స్నేహ రెడ్డి, స్టార్ హీరోయిన్ సమంత, మంచు లక్ష్మి, హన్సిక మరికొంతమంది సెలబ్రిటీలు ఫాలో అవుతున్నారు. దీంతో బన్నీ ఫాన్స్ ఇప్పుడు అల్లు అర్జున్ ప్రైవేట్ అకౌంట్ కోసం సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.

మన టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా చాలామంది సెలబ్రిటీలు ఇలాంటి ఫేక్ అకౌంట్స్ ని కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ జాహ్నవి కపూర్, సుహానా ఖాన్, షనాయ కపూర్ వంటి హీరోయిన్స్ పబ్లిక్ అకౌంట్స్ తో పాటు పలు ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కూడా కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మన బన్నీకి పబ్లిక్ అకౌంట్ తో పాటూ ఓ ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండటం సర్వత్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువమంది ఫాలోవర్స్ కలిగిన హీరో మన బన్నీనే కావడం విశేషం. అలాంటి అల్లు అర్జున్ ప్రైవేట్ గా మరో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని మెయింటైన్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: