ముసలి వాడిగా మారనున్న ప్రభాస్.. టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్..?

Anilkumar
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మారుతి తో ఓ సినిమా చేస్తున్నాడు అనే విషయం తెలిసి అందరి దృష్టి ఇప్పుడు ఈ ప్రాజెక్టు పైన పడింది.ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ అన్ని భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్నాడు. కానీ వీటితోపాటు మారుతితో ఓ చిన్న బడ్జెట్ సినిమా ఒప్పుకోవడంతో అభిమానులు అయితే ఈ సినిమాపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకుండా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది. దాదాపు ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది. 

అయితే ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే టైటిల్ ని మారుతి ఫిక్స్ చేసినట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా.. అంతేకాదు ఈ సినిమా ఓ పాడు పడ్డ ఇంటి చుట్టు తిరిగే హారర్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతుందని ప్రచారం కూడా జరిగింది. అలా ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా రకాల ప్రచారాలు జరిగాయి. ఇప్పుడు తాజాగా మరో ప్రచారం తెర పైకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభజన పాత్రలో కనిపిస్తారట. అందులో ఒకటి తాత పాత్ర అయితే మరొకటి మనవడి పాత్ర అని అంటున్నారు. నిజానికి తాత పాత్రను ముందుగా ఓ సీనియర్ హీరోతో చేయించాలని అనుకున్నారు. కానీ ప్రభాస్ చేతనే తాత పాత్రను చేస్తే అది ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో మారుతి ఈ నిర్ణయం తీసుకున్నారట.అటు ప్రభాస్ కూడా ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.

అంతేకాదు ఇది హారర్ డ్రామా కాదని ఒక పీరియాడిక్ మూవీ అని కూడా చెబుతున్నారు. దీన్నిబట్టి ప్రభాస్ ఇప్పుడు ముసలోడి పాత్రలో కనిపిస్తున్నాడని వార్త బయటికి రావడంతో ఈ విషయంలో ఫాన్స్ అయితే కాస్త నిరాశకే గురవుతున్నారు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తాతా-మనవల్ల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ రొటీన్ గా ఉన్న ప్రభాస్ తో మారుతీ ఖచ్చితంగా ఏదో మ్యాజిక్ చేస్తాడని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి తాత మనవళ్ల పాత్రలో ప్రభాస్ ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి. ఇక త్వరలోనే షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహన్,నిధి అగర్వాల్ , రిద్ది కుమార్ హీరోయిన్స్ గా కనిపించరున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: