మన సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల అభిమానులు వార్నింగ్స్ ఇవ్వడం కామనే. తమ అభిమాన హీరోని ఎవరైనా అవమానించినా, వివాదాస్పదంగా మాట్లాడిన, ఎగతాళి చేసిన అభిమానులు రెచ్చిపోయి వాళ్లను ట్రోల్ చేస్తూ ఉంటారు. మళ్లీ వాళ్లు క్షమాపణ చెప్పేంతవరకు ఫాన్స్ అస్సలు వదలరు. ఇప్పుడు అలాంటి పరిస్థితి మన జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ వచ్చింది. అతనిపై బన్నీ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ముక్కు అవినాష్ బుల్లితెరపై తనదైన కామెడీతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ లో కూడా పాల్గొని ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా అవినాష్ చేసిన ఓ పని బన్నీ ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది.
దాంతో అవినాష్ కి బన్నీ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ అవినాష్ చేసిన మిస్టేక్ ఏంటంటే.. పుష్ప2 పోస్టర్ని ఎడిట్ చేయడమే. ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప2 టీజర్ తో పాటు ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్. ఆ పోస్టర్ పాన్ ఇండియా వ్యాప్తంగా ఆడియన్స్ ని షాక్ కి గురి చేసింది. అమ్మవారి రూపంలో ఊర మాస్ లుక్ లో ఉన్న బన్నీ పిక్ సోషల్ మీడియాని షేక్ చేసింది. అటు బన్నీ ఫ్యాన్స్ కూడా ఈ లుక్ చూసి షాక్ అయిపోయారు. అయితే ఈ పిక్ ను అవినాష్ తన ఫోటోతో కలిపి ఎడిట్ చేశాడు. దాన్ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇక ఈ ఎడిటింగ్ పిక్ తో బన్నీకి బర్త్డే విషెస్ కూడా చెప్పాడు. అయితే ఈ ఫోటో చూసిన బన్నీ ఫాన్స్ అవినాష్ కు వార్నింగ్ ఇస్తున్నారు.
అర్జెంటుగా ఆ పిక్ డిలీట్ చెయ్, ఫ్యాన్స్ ను ఇరిటేట్ చేయకు. అల్లు అర్జున్ చేస్తే గంగమ్మ తల్లి లా ఉంది. అదే నువ్వు చేస్తే పక్కింటి మంగమ్మలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అర్జెంటుగా ఆ పిక్ డిలీట్ చేయకపోతే నీకు పగిలిపోద్ది అంటూ అవినాష్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు బన్నీ ఫాన్స్. మరి బన్నీ ఫ్యాన్స్ ఇస్తున్న వార్నింగ్ అవినాష్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి? ఫ్యాన్స్ దెబ్బకి అవినాష్ ఆ పిక్ ని డిలీట్ చేసి, సారీ చెబుతాడా? లేక ఫ్యాన్స్ కి రివర్స్ కౌంటర్ ఇస్తాడా? అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇక ప్రస్తుతం ప్రముఖ బుల్లితెర టీవీ ఛానల్ మా స్టార్ మా లో పలు ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు అవినాష్. ఇక ప్రోగ్రామ్స్ లో తనదైన కామెడీ టైమింగ్, పంచులతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు...!!