సమంతకు బాసటగా రంగంలోకి దిగిన మృణాల్ ఠాకూర్ !

Seetha Sailaja

ఈవారం విడుదల కాబోతున్న ‘శాకుంతలం’ మూవీ సమంత కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా విడుదల అవుతున్న ఈ మూవీ సక్సస్ స్థాయిని బట్టి ఆమెకు టాప్ హీరోల సినిమాలలో అవకాశాలు వచ్చే విషయం ఆధారపడి ఉంటుంది అన్న అంచనాలు ఉన్నాయి. ఈ విషయాన్ని పూర్తిగా సమంత గ్రహించడంతో ‘శాకుంతలం’ మూవీ ప్రమోషన్ ను తన శక్తికి మించి చేస్తోంది.


గతంలో సమంత ఎంతోమంది టాప్ హీరోయిన్స్ తో కలిసి నటించింది. అయితే వారెవ్వరు సమంత ‘శాకుంతలం’ చూడాలని ఉంది అంటూ ఇంతవరకు ఎవరు స్పందించలేదు. అయితే బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాత్రం తను శాకుంతలం మూవీని మొదటిరోజు మొదటి షో ధియేటర్ లో చూస్తాను అని చెప్పడమే కాకుండా ‘మనం ఇద్దరం ఎప్పుడు కలిసి నటిద్దాం’ అంటూ ఆమె ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోష్ట్ కు సమంత సమాధానం ఇస్తూ ‘త్వరలో’ అంటూ రిప్లయ్ పెట్టింది.


‘సీతారామం’ హీరోయిన్ గా ఎంతో పేరు తెచ్చుకున్న మృణాల్ తనకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండి ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె అంగీకరించకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలు మాత్రమే తాను ఓకె చెపుతాను అని చెపుతున్నట్లు టాక్. ప్రస్తుతం ఆమె నానీతో కలిసి ఒక మూవీలో నటిస్తోంది. ‘శాకుంతలం’ మూవీ తరువాత సమంత ‘ఖుషీ’ మూవీలో నటించవలసి ఉంది.


ఆతరువాత ఆమె నటించే సినిమాలు ఏమీ ఇంకా ఫైనల్ కాలేదు. ఒకవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మరొక వైపు గ్లామర్ పాత్రలు చేయాలని ఆమె అనుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు గ్లామర్ పాత్రలు ఇచ్చే విషయంలో టాప్ దర్శకులు ముందుకు రావడం లేదు అని అంటున్నారు. దీనితో మృణాల్ సూచనను పరిగణించి ఆమెతో కలిసి మరో హీరోయిన్స్ ఓరియెంటెడ్ సినిమాలో ఆమె నటించే అవకాశం వస్తుందో లేదో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: