USA లో అత్యధిక కలెక్షన్లు సాధించిన హీరోయిన్స్ చిత్రాలు ఎన్నో తెలుసా..?
హీరోయిన్ కీర్తి సురేష్ తన కెరియర్ లోనే నటించిన సినిమాలలో అత్యధికంగా యూఎస్ఏ లో 4 సినిమాలు కలెక్షన్లు సాధించింది.. ఆ తర్వాత హీరోయిన్ తమన్నా కూడా తను నటించిన సినిమాలలో 4 సినిమాలలో అత్యధికంగా యూఎస్ఏ లో కలెక్షన్లు రాబడ్డాయి. ఆ తర్వాత స్థానంలో రష్మిక 3 సినిమాలు పూజా హెగ్డే 3 సినిమాలు ఉండగా సమంత ,అనుష్క ,శృతిహాసన్, 2 సినిమాలతో అత్యధికంగా కలెక్షన్లను రాబట్టినట్లుగా తెలుస్తోంది. అయితే స్టార్ హీరోయినిగా పేరు పొందిన కొంతమంది హీరోయిన్లు మాత్రం ఈ లిస్టులో లేకపోవడంతో కాస్త అభిమానులు నిరుత్సాహపడుతున్నారు.
ప్రస్తుతం ఇందులోని హీరోయిన్స్ సైతం ఇతర భాషలలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇక తమ చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్ లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్న హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో పెరిగిపోతూనే ఉన్నారు. ప్రస్తుతం వీరి సినిమాల విషయానికి వస్తే కీర్తి సురేష్ దసరా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తమన్నా భోళా శంకర్, జైలర్ సినిమాలో నటిస్తోంది. రష్మిక పుష్ప-2 లో, సమంత శాకుంతలం, అనుష్క శెట్టి నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా నటిస్తోంది. శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాలో నటిస్తోంది. మరి రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలతో యూఎస్ఏ లో అత్యధికంగా కలెక్షన్లు రాపడతారేమో చూడాలి మరి.