తెలుగు
సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో బాబి ఒకరు. ఈ దర్శకుడు రవితేజ హీరోగా రూపొందిన పవర్
మూవీ తో దర్శకుడు గా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ
మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఈ దర్శకుడు అనేక
మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా బాబి ...
మెగాస్టార్ చిరంజీవి హీరోగా
శృతి హాసన్ హీరోయిన్ గా మైత్రి
మూవీ సంస్థ నిర్మించిన వాల్టేర్ వీరయ్య అనే పక్కా
మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్
మూవీ కి దర్శకత్వం వహించాడు.
ఈ
మూవీ ఈ సంవత్సరం
సంక్రాంతి కానుకగా
జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ విడుదల అయ్యి ఇప్పటికే కొంత కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు
బాబీ తదుపరి
మూవీ కి సంబంధించిన అధికారిక అప్డేట్ రాలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడి తదుపరి
మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళితే ... ఈ దర్శకుడు తన తదుపరి
మూవీ ని
సూపర్ స్టార్ రజనీ కాంత్ తో చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రేజీ
మూవీ ని ప్రముఖ
నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రజనీ కాంత్ ... నెల్సన్
దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్
మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు.