పుష్ప ది రూల్ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? ఎప్పుడెప్పుడు థియేటర్లో చూసేద్దామా? అని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ సైతం ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఇక మూవీ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఇటీవల టీజర్ తో స్పెషల్ ట్రేట్ ఇస్తూనే సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేశాడు సుకుమార్. ఇటీవల విడుదలైన పుష్ప2 ఫస్ట్ లుక్ పోస్టర్లో అర్ధనారీశ్వరుడిగా అమ్మవారి గెటప్ లో బన్నీ ని చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయిపోయారు. ఒక్క పోస్టర్ తోనే పుష్ప2 నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అర్థమైపోయింది.
ఈ క్రమంలోనే పుష్ప ది రూల్ పై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది.షూటింగ్ చక చకా జరుగుతుండటంతో సినిమా కూడా ఇదే ఏడాదిలో ఉంటుందని అంతా అనుకుంటున్నారు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పుష్ప2 ని వచ్చే ఏడాది రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ టీం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 2024 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప పార్ట్2 ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ దాదాపుగా ఫిక్స్ అయ్యారని ఇండ్రస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ డేట్ ని మైత్రి నిర్మాతలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అటు సుకుమార్ బన్నీ కూడా ఇదే డేట్ కి మొగ్గు చూపుతున్నారట.
అయితే ఈ డేట్ మరీ లాంగ్ అవుతుందని కూడా మూవీ టీం ఆలోచిస్తున్నారట.ఇక త్వరలోనే సినిమాని ఈ ఏడాది చివరికి రిలీజ్ చేయాలా? లేక వచ్చే ఏడాది బన్నీ బర్త్ డే కి రిలీజ్ చేయాలా? అనేదానిపై నిర్మాతలు ఓ కొలిక్కి రానున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఎలా చూసుకున్న ఈ ఏడాది పుష్ప 2 రిలీజ్ లేనట్లే అని అంటున్నారు. ఒక విధంగా ఇది ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్ అని చెప్పక తప్పదు. ఇక సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సుమారు 400 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ బాలీవుడ్ స్టార్ హీరో గెస్ట్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే దీనిపై మూవీ టీం ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వాల్సి ఉంది...!!