చిరుత కాదు చిట్టెలుక.. చరణ్ పై బలగం నటుడు కామెంట్?
దిల్ రాజు సమర్పణలో ఇక ఆయన తనయులు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ సినిమాను నిర్మించారు అని చెప్పాలి. ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడమే కాదు ప్రతి ప్రేక్షకుడి మదిని దోచేసింది అని చెప్పాలి. దీంతో ఇక ఈ సినిమాలోని నటీనటులు ఎక్కడ చూసినా ఇంటర్వ్యూలలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో అల్లుడు నారాయణ పాత్రలో నటించిన మురళీధర్ గౌడ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
మా ఆఫీసులో పనిచేసే ఒక మహిళ చిరంజీవి అభిమాని. ఆయన కొడుకు రామ్ చరణ్ మొదటి సినిమా రిలీజ్ రోజునే బ్యాంకు పని ఉందని అబద్ధం చెప్పి సినిమాకు వెళ్ళింది. ఆ విషయం నాకు తెలిసింది. ఇక ఆమె మళ్ళీ తిరిగి ఆఫీసుకు వచ్చాక సినిమా ఎలా ఉంది అని అడిగాను. అయితే అందుకు ఆమె బదులు ఇస్తూ.. ఏం సినిమా సార్.. చిరుత అని పేరు పెట్టారు.. కానీ చిట్టెలుకలా కూడా లేడు అంటూ కామెంట్లు చేసింది. అయితే ఇలా సినిమాల్లోకి వచ్చిన సమయంలో రామ్ చరణ్ పై ప్రజల్లో అలాంటి అభిప్రాయం ఉండేది. కానీ నేడు ఏ స్టేజిలో ఉన్నాడు. నటుడిగా ఎంతో ఎదిగాడు. అందుకోసం తనని తాను ఎంతో మార్చుకున్నాడు అంటూ మురళీధర్ గౌడ్ ప్రశంసలు కురిపించారు.