టాలీవుడ్
యువ హీరో అక్కినేని
అఖిల్ ప్రస్తుతం ఏజెంట్
మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు. ఈ
మూవీ భారీ బడ్జెట్ తో పాన్
ఇండియా మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాకు
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ
మూవీ కి హిప్ హాప్ తమిజ సంగీతం అందిస్తున్నాడు.
మమ్ముట్టి ఈ
మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నాడు. ఈ
మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన తెలుగు ...
తమిళ ...
కన్నడ ... మలయాళ ...
హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
ఇప్పటికే ఈ
మూవీ బృందం ఈ
సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అందులో
అఖిల్ నటన బాగుండడంతో ఈ
మూవీ పై అక్కినేని అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ
సినిమా నుండి చిత్ర బృందం రెండు పాటలను విడుదల చేసింది. నిన్న ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి మూడవ పాటకు సంబంధించిన ప్రోమో ను విడుదల చేసింది. ఈ పాట ప్రోమో కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి "రామ కృష్ణ" అంటూ సాగే మూడవ సాంగ్ విడుదల తేదీని సమయాన్ని ప్రకటించింది. ఈ
మూవీ లోని మూడవ సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
మూవీ తో
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న
అఖిల్ "ఏజెంట్"
మూవీ తో ఏరెంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఈ
మూవీ ని దర్శకుడు
సురేందర్ రెడ్డి మోస్ట్ స్టైలిష్ యాక్షన్ త్రిల్లర్
మూవీ గా రూపొందిస్తున్నాడు.
సైరా నరసింహా
రెడ్డి మూవీ తర్వాత
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన
మూవీ కావడంతో ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.