పాన్ ఇండియా లెవల్లో పవన్ విధ్వంసం..!

shami
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి తన ఫోకస్ అంతా కూడా సినిమాల మీద పెట్టినట్టు తెలుస్తుంది. వీరమల్లు ప్యాచ్ వర్క్ తో పాటుగా వినోదయ సీతం సినిమాను ఆడుతూ పాడుతూ పూర్తి చేశాడు. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ డైరెక్షన్ లో ఓజీ రెండు సినిమాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. హరీష్ శంకర్ తో గబ్బర్ సింగ్ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ఎట్టకేలకు ఓ రీమేక్ మూవీతో వస్తున్నారు. విజయ్ నటించిన తెరి రీమేక్ తో ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది. అయితే సినిమా మూల కథని తీసుకుని ట్రీట్ మెంట్ హరీష్ శంకర్ స్టైల్ లో మార్చినట్టు తెలుస్తుంది.
ఇక ఇదిలాఉంటే ఒరిజినల్ కథతో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా వస్తున్నాడు పవన్. పంజా తర్వాత గ్యాంగ్ స్టర్ గా నటించని పవన్ ఈసారి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సుజిత్ సినిమాకు ఓకే చెప్పారు. సినిమా మొదటి నుంచి చాలా ఎగ్జైటెడ్ గా ఉంటుందని తెలుస్తుంది. సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని సో ఒక ఫ్యాన్ ఆయన్ను ఎలా చూడాలని అనుకుంటాడో అలా చూపించాలని ఫిక్స్ అయ్యాడు. అయితే ఓజీ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ ఉంటుందని టాక్. అదే జరిగితే పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో నేషనల్ వైడ్ గా ప్రూవ్ అవుతుంది.
మన స్టార్ హీరోలంతా కూడా ఇప్పుడు తాము చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో తీస్తున్నారు. పవన్ హరి హర వీరమల్లు కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లానింగ్ లో ఉంది. అయితే ఆ సినిమా ఎలా ఉన్నా ఓజీ మాత్రం నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఆల్రెడీ ప్రభాస్ సాహోతో పాన్ ఇండియా ఆడియన్స్ కు పరిచయమైన సుజిత్ ఈసారి పవర్ స్టార్ సినిమాతో వస్తున్నాడు. మరి ఈ ఓజీ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: