ఆ తర్వాత స్నేహితుడా సినిమాలో కూడా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించిన
మాధవి లత సినిమాలకు విరామం ఇచ్చి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె మరింత పాపులారిటీ ను సంపాదించుకుంది. అలా రాజకీయ నాయకురాలుగా సినీ నటిగా భారీగా పాపులారిటీని సంపాదించుకుందట
మాధవి లత. తాజాగా
మాధవీలత చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక
నిర్మాత నైట్ కి వస్తావా అని నన్ను నేరుగా అడిగారు అని ఆమె తెలిపింది.తనకు ఎవరినీ బాధ పెట్టాలని అస్సలు ఉండదని,కానీ సహనం కోల్పోతే మాత్రం ఎలాంటి మాటలు అయిన అనేస్తాను చెప్పుకొచ్చింది. కాస్టింగ్ కౌచ్ సంగతి గురించి మాట్లాడుతూ.. ఒక
ప్రొడ్యూసర్ నాతో తప్పుగా మాట్లాడితే నేను మీరు అనుకున్న వ్యక్తిని అయితే కాదండి అని నెమ్మదిగా కూల్ గా సమాధానం ఇచ్చాను. ఒక్కరోజు నైట్ కి వస్తావా అని అడిగిన వాళ్లు ఆ తర్వాత నన్ను అమ్మ అని పిలిచారు అని కూడా చెప్పుకొచ్చిందట
మాధవి లత.
సినిమా ఇండస్ట్రీలో మనం ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అక్కడ అలా ప్రవర్తించాలి. సాఫ్ట్‌గా మన పని చేసుకుని బయటకు అయితే వచ్చేయాలి అని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే తాను ప్రస్తుతం మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నట్లు కూడా చెప్పుకొచ్చింది.