మరో బాలీవుడ్ స్టార్ హీరోతో సమంత సినిమా.. టైటిల్ కూడా ఫిక్స్..?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'శాకుంతలం' చిత్రం నిన్న థియేటర్స్ లో గ్రాండ్గా విడుదలైంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీని అగ్ర దర్శకుడు గుణశేఖర్ డైరెక్ట్ చేశారు. ఇక మరోవైపు మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత 'ఖుషీ' అనే సినిమాలో నటిస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
 ఇక ఈ ప్రాజెక్టు తో పాటు అటు బాలీవుడ్ లోనూ వరుణ్ ధావన్ తో కలిసి 'సిడాటేల్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది సమంత. హాలీవుడ్ మూవీ కి రీమేక్ గా వస్తున్న ఈ వెబ్ సిరీస్ పై భారీ అంచనాల నెలకొన్నాయి. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ని తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తున్నారు.ఇదిలా ఉంటె ఇప్పుడు బాలీవుడ్ లో సమంత మరో ప్రాజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా తో సమంత ఓ సినిమా చేస్తోందట. ఇక ఈ మూవీని అమర్ కౌశిక్ డైరెక్ట్ చేయబోతున్నాడు. అంతేకాదు ఈ చిత్రానికి 'వామ్ ఫైర్స్ ఆఫ్ విజయనగర్' అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం 'స్త్రీ2' సినిమాతో బిజీగా ఉన్న డైరెక్టర్ అమర్ కౌశిక్..ఈ మూవీ కంప్లీట్ అయ్యాక ఆయుష్మాన్ సమంతల కాంబినేషన్ ప్రాజెక్టును స్టార్ట్ చేయబోతున్నారట. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సమంత ఖుషి, సిడాటెల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో ఆయుష్మాన్ ఖురానా తో చేయబోయే మూవీ కాస్త ఆలస్యంగానే మొదలుకానునట్లు సమాచారం. ఇక ఈ మూవీ తోనే సమంత బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. అయితే దీనికంటే ముందు ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో సమంత నెగిటివ్ రోల్ పోషించి బాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది.కానీ హీరోయిన్ గా మాత్రం ఆయుష్మాన్ ఖురానా తో చేయబోయే ప్రాజెక్ట్ తోనే సమంత బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: