బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కిసీకా భాయి కీసిక జాన్'. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి హైప్ ని క్రియేట్ చేశాయి. ఇక రంజాన్ కానుకగా ఈనెల 21న విడుదల కాబోతున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మన టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాలో నటించిన నటి పాలజ్ తివారి సల్మాన్ ఖాన్ పై సెన్సేషనల్ కామెంట్ చేసింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాలక్ తివారి సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుతూ..' సల్మాన్ ఖాన్ తో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఆయన సెట్ లో అమ్మాయిలు ప్రతి ఒక్కరూ పద్ధతిగా బట్టలు వేసుకోవాలని రూల్ పెట్టారని తెలిపింది.ముఖ్యంగా డీప్ నెక్ ఉండే డ్రెస్సులు అసలు వేసుకోవద్దని సల్మాన్ ఖాన్ స్ట్రిక్ట్ రూల్ పెట్టారని చెప్పింది. ఆయన ఇలాంటి రూల్ పెట్టడానికి కారణమేంటంటే.. సాంప్రదాయాలకు ఆయన ఎక్కువ విలువ ఇస్తారు. తన చుట్టూ ఉండే మహిళలు ఎంతో సేఫ్ గా ఉండాలని కోరుకుంటారు. ఇక సల్మాన్ ఖాన్ తో షూటింగ్ అనగానే మా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకంటే మా అమ్మకి నా డ్రెస్సింగ్ విషయంలో కొన్ని కంప్లైంట్స్ ఉండేవి.
కానీ సల్మాన్ ఖాన్ మూవీలో ఆయన పెట్టిన స్ట్రిక్ట్ రూల్స్ నేపథ్యంలో నేను నిండుగా బట్టలు వేసుకుని షూటింగ్ కి వెళుతుంటే మా అమ్మ చూసి ఎంతో మురిసిపోయేది' అంటూ చెప్పుకొచ్చింది ఈ పాలక్ తివారి. దీంతో సల్మాన్ ఖాన్ పై ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతుండగా.. సల్మాన్ ఖాన్ కి లేడీస్ అంటే ఎంత రెస్పెక్ట్ ఉందో మరోసారి ఈమె మాటల్లో బయటపడడంతో.. ఆడవాళ్ళ పట్ల సల్మాన్ ఖాన్ చూపిస్తున్న గౌరవానికి ఆయన ఫ్యాన్స్ ఫీదా అవుతున్నారు. ఇక గత కొంతకాలంగా సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమాలేమీ బాక్స్ దగ్గర ఆశించిన స్థాయి ఫలితాలను అందుకోలేకపోతున్నాయి. దీంతో ఈసారి కిసికా భాయ్ కిసీకా జాన్ మూవీ తో మంచి కం బ్యాక్ ఇవ్వాలని సల్లు భాయ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అన్నట్టు ఈ మూవీ మన టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'కాటమరాయుడు' మూవీకి రీమేక్ గా తెరకెక్కింది...!!