సమంత పై ఆసక్తికర పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ..!!
ఈ నేపథ్యంలోనే నటుడు విజయ్ దేవరకొండ కూడా సమంత గురించి ఒక సుదీర్ఘమైన నోట్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారని తెలుస్తుంది.. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఇకపోతే ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. 'సామ్ నువ్వు ఎప్పుడు ఎంతో ప్రేమగా ఉంటూ ఎప్పుడు సరైన నిర్ణయాలే తీసుకుంటావు అంటూ ఇప్పటికీ సినిమాలోని ప్రతి షార్ట్ కోసం బెస్ట్ ఇవ్వడానికే నీ ప్రయత్నం చేస్తావు. సినిమాలపైనే నీ కెరియర్ ఆధారపడి ఉంది.. కానీ ఒక ఏడాది నుంచి నువ్వు నీ జీవితంతో ఎంతో ఫైట్ చేస్తున్నావు. ఈ విషయం మాత్రం ఎవరికీ అస్సలు తెలియదు. అయినా ఎప్పుడూ నవ్వుతూనే సినిమాల కోసం నువ్వు ముందడుగు వేస్తున్నావు.
ఒకవైపు నీ శరీరం విశ్రాంతి తీసుకోమని చెబుతున్నా కానీ నువ్వు బ్రేక్ ఇవ్వకుండా ముందుకు దూసుకుపోతూనే ఉన్నావు. ఈ సమయంలో విడుదలవుతున్న శాకుంతలం సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అంటూ
విజయ్ దేవరకొండ సుదీర్ఘమైన పోస్ట్ ను అయితే షేర్ చేశారు. మరోవైపు సమంతా (Samantha) రిప్లై ఇస్తూ..' ఇలాంటి సమయంలో నాకు కావాల్సింది కూడా ఇదే.. ఇప్పుడు అస్సలు మాటలు కూడా రావడం లేదు.. థాంక్యూ మై హీరో ' అంటూ విజయ్ దేవరకొండ పోస్ట్ కు రిప్లై కూడా ఇచ్చిందట సమంత.