వెంకీ సరసన జెర్సీ భామ.. న్యూ లుక్ వైరల్..!!

Divya
విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన నటుడు విక్టరీ వెంకటేష్ గురించి చెప్పాల్సిన పనిలేదు. హీరోగా ఎన్నో సినిమాలలో నటించి పలు సినిమాలలో మల్టీస్టారర్ హీరోగా నటించి మంచి విజయాలను అందుకున్నారు. తాజాగా డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వెంకీ కెరియర్ లోనే 75వ చిత్రం గత నెలల ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం వైజాగ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది .నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకం పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు.
కాస్త విరామం తర్వాత తారాగణంతో రెండో షెడ్యూల్ ని వైజాగ్ లో నిర్వహించబోతున్నది చిత్ర బృందం. ఈ సినిమాలో వెంకి పక్కన హీరోయిన్గా శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తున్నది. ఈ క్రమంలోనే చిత్ర బృందం హీరోయిన్ పాత్రను పరిచయం చేయడం జరిగింది.ఇందులో ఈమె మనోజ్ఞ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. చీర కట్టుకొని శూన్యంలోకి తొంగి చూస్తూ శ్రద్ధ శ్రీనాథ్ దేని గురించో చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నట్టుగా ఈ పోస్టర్ కనిపిస్తోంది. చేతిలో మూత తెరిచి ఉన్న లంచ్ బాక్స్ పట్టుకొని కారులో కూర్చొని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇందులో శ్రద్ధ చాలా అందంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు శ్రద్ధా కు వచ్చిన క్యారెక్టర్లలో ఈ సినిమా బెస్ట్ అన్నట్లుగా అభిమానులు భావిస్తున్నారు.. జెర్సీ సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా ఈమెకు కలిసొస్తుందని భావిస్తూ ఉన్నారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో ప్రతి పాత్రకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చిత్ర బృందం తెలియజేస్తోంది. సైందవ్ సినిమా మొత్తం మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే ఉండబోతుందని వార్తలు గడిచిన కొద్దిరోజుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్ ,కన్నడ ,మలయాళం, హిందీ వంటి భాషలలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్ 22న విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: