సాయి ధరమ్ తేజ్ తాజాగా విరూపాక్ష అనే సస్పెన్స్
థ్రిల్లర్ హార్రర్
మూవీ లో
హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో సంయుక్తా
మీనన్ హీరోయిన్ గా నటించగా ...
కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడుగా తన కెరియర్ ను ప్రారంభించ బోతున్నాడు. ఈ
మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా ప్రమోషన్ లను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తోంది.
అందులో భాగంగా తాజాగా ఈ
మూవీ బృందం నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్
ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించింది. ఈ
మూవీ ఫ్రీ రిలీజ్
ఈవెంట్ కు దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ప్రస్తుతం ఈ
మూవీ యూనిట్ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ...
టీవీ షో లలో పాల్గొంటూ ఈ సినిమాను అదిరిపోయే రేంజ్ లో ప్రమోట్ చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను ప్రకటించింది.
ఈ
మూవీ యూనిట్ ఈ
మూవీ లోని "కళ్ళల్లో" అనే సాంగ్ విడుదల తేదీని తాజాగా ప్రకటించింది. ఈ
మూవీ లోని "కళ్ళల్లో" అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 04 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్.లో సాయి తేజ్ మరియు సంయుక్త
మీనన్ లు ఉన్నారు. ప్రస్తుతం ఈ
పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.