నాచురల్ స్టార్
నాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికి ఎన్నో అద్భుతమైన విజయవంతమైన
సినిమా లలో నటించి నటుడి గా తనను తాను ఎన్నో సార్లు ప్రూవ్ చేసుకొని
బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్న
నాని తాజాగా ఈ సంవత్సరం
మార్చి 30 వ తేదీన విడుదల అయినటువంటి
దసరా అనే
మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.
కీర్తి సురేష్ ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటించగా ...
శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త దర్శకుడు ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల అయిన ఈ
సినిమా ఇప్పటికే అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇప్పటి వరకు ఈ
సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే
నాని తన తదుపరి మూవీ.ని శౌర్యవ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ
మూవీ నాని కెరియర్ లో 30 వ
మూవీ గా రూపొందబోతుంది. ఈ సినిమాకు ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ
మూవీ ని
నాని 30 అనే పేరుతో చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాను ఈ సంవత్సరం
డిసెంబర్ 21 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ
పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.