ఆ తెలుగు సినిమాను హిందీలో విడుదల చేయనున్న సల్మాన్ ఖాన్..?

Pulgam Srinivas
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ హిందీ మూవీ లలో హీరో గా నటించిన సల్మాన్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. తాజాగా ఈ హీరో కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది.


ఈ మూవీ లో సల్మాన్ హీరో గా నటించిన మాత్రమే కాకుండా ఈ మూవీ కి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. విక్టరీ వెంకటేష్ ... భూమిక చావ్లా ... జగపతి బాబు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ లో సల్మాన్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఒక సాంగ్ లో రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేయగా ఆ సాంగ్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. అందులో భాగంగా ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ ను సల్మాన్ ఖాన్ ... జీ స్టూడియో సంస్థ తో కలిసి విడుదల చేయబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. సల్మాన్ కనుక ఈ మూవీ ని హిందీ లో విడుదల చేసినట్లు అయితే ఈ మూవీ పై అదిరిపోయే క్రేజ్ హిందీ ప్రేక్షకుల్లో నెలకొనే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: