ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు . చాలా సంవత్సరాలుగా ఎన్నో సినిమాల్లో నటించి నప్పటికీ రాని క్రేజ్ పోయిన సంవత్సరం డీజే టిల్లు మూవీ తో సిద్దు కి దక్కింది . సిద్దు "డీజె ట్టిల్లు" మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని ... అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించు కున్నాడు. ఈ మూవీ లోని నటన కు గాను సిద్దు కు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి .
ఇలా డీజె టిల్లు మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ యువ హీరో ఈ సినిమాకు సీక్వల్ గా టిల్లు స్క్వేర్ అనే మూవీ ని రూపొందిస్తున్నాడు . ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా వరకు షూటింగ్ బాగాన్ని కూడా పూర్తి చేసుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది . ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నట్లు సమాచారం అలాగే ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో సిద్దు పై రాబోయే ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది .
vప్రస్తుతం ఈ చిత్ర బృందం సిద్దు పై చిత్రీకరిస్తున్న సన్నివేశాలు ఈ మూవీ లో హైలైట్ గా ఉండ బోతున్నట్లు సమాచారం . అలాగే ప్రస్తుతం సిద్దు పై చిత్ర బృందం చిత్రకరిస్తున్న సన్నివేశాలు కూడా చాలా బాగా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డీజే టిల్లు మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో టిల్లు స్క్వేర్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.