విక్టరీ
వెంకటేష్ సినిమాల విషానికి వస్తే ఆకరుగా ఎఫ్ 3 అనే
మూవీ లో
హీరో గా నటించాడు. ఈ
మూవీ మంచి విజయం అందుకుంది. తాజాగా
వెంకటేష్ "రానా నాయుడు" అనే వెబ్ సిరీస్ లో కూడా కీలక పాత్రలో నటించాడు.
రానా కూడా ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించాడు. కొన్ని రోజుల క్రితం నుండి ఈ వెబ్ సిరీస్
నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా
వెంకటేష్ "కిసీ కా భాయ్ కిసీ కా జాన్"
హిందీ మూవీ లో కీలక పాత్రలో నటించాడు.
సల్మాన్ ఖాన్
హీరో గా నటించిన ఈ
మూవీ లో
పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు ఈ
మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాను ఏప్రిల్ 21 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
వెంకటేష్ "సైంధవ్" అనే
మూవీ లో
హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ
మూవీ లో శ్రద్ధ శ్రీనాథ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.
ఇలా ఉంటే ప్రస్తుతం ఈ
మూవీ యొక్క షూటింగ్
వైజాగ్ లో జరుగుతుంది. ప్రస్తుతం
వైజాగ్ లో ఈ
మూవీ యూనిట్
వెంకటేష్ మరియు
శ్రద్ధా శ్రీనాథ్ లపై ఈ
మూవీ లోని అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ
మూవీ బృందం తెరకెక్కిస్తున్న సన్నివేశాలు ఈ సినిమాలో చాలా హైలైట్ గా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ
మూవీ పై
వెంకటేష్ అభిమాను లతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.