ఆ మూవీ విడుదల కు ఇది సరైన సమయం కాదని అంటున్న నెటిజన్స్....!!
తాజాగా ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర యూనిట్ సభ్యులపై ప్రశంసలు కురిపించాడు. సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయిన తర్వాత చేసిన మొదటి సినిమా ఇదే. యాక్సిడెంట్ అయిన కొన్ని రోజుల తర్వాత తేజ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.
మొదట్లో ప్రతి డైలాగ్ ని కూడా చెప్పడానికి కూడా ఇబ్బంది పడేవాడు. ఎంతో ఉత్సాహంగా షూటింగ్ లో పాల్గొంటూ అందరిని నవ్విస్తూ ఉండే సాయి ధరమ్ తేజ్ ని అలా చూసి చాలా బాధేసింది. అతడు తిరిగి సాధారణ స్థితికి రావాలని ప్రార్థించాను. అలాంటి సాయి ధరం తేజ్ ఇప్పుడు ఇలాంటి ఒక సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని సుకుమార్ పేర్కొన్నాడు.ఈ సినిమా ఖచ్చితంగా మంచి థ్రిల్లర్ సినిమా అయి ఉండవచ్చు. కానీ ఇది సరైన సమయం కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు మాస్ మరియు కమర్షియల్ సినిమాలకు పెద్దపీట వేస్తున్నారు. అలాంటి ప్రేక్షకుల ముందుకు హర్రర్ థ్రిల్లర్ సినిమా ను తీసుకు రావడం కచ్చితంగా మంచి నిర్ణయం కాదని ప్రేక్షకుల తో పాటు కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఫలితం పై పలువురు పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మరి విరూపాక్ష అసలు ఫలితం ఏంటి అనేది చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.