వైరల్ గా మారిన సాయి ధరమ్ తేజ్ కామెంట్స్....!!
ఈ ప్రమోషన్ కార్యక్రమాల లో భాగంగా తాజాగా ఏలూరు లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ తన ప్రమాదం గురించి పలు విషయాలను తెలియచేశారు.
ఈ సినిమా షూటింగ్ కు ముందు ఈయన రోడ్డు ప్రమాదాని కి గురయిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బైక్ పై ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. తాను ప్రమాదానికి గురై మీ అందరిని చాలా టెన్షన్ పెట్టాను అందుకు నన్ను క్షమించండి అంటూ ఈ సందర్భంగా క్షమాపణలు కోరారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత నాకు స్పృహ రాగానే తాను మొదటగా మా అమ్మ, నా తమ్ముడిని వీరిద్దరిని చూశానని తెలిపారు. అయితే వారికి సారీ చెప్పడానికి ప్రయత్నించిన నాకు మాటలు రావడంలేదని సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు. బాధ ఒక మనిషిని ఎంతగా మార్చగలదో అప్పుడు తనకు అర్థం అయిందని అప్పుడే అర్థమైంది తన జీవితంలో వచ్చినటువంటి ఎన్నో సవాళ్ల ను స్వీకరించి తిరిగి మీతో మాట్లాడాలని నిర్ణయించుకున్నా.. మీ ప్రేమను పొందాలన్నదే నా లక్ష్యం.మీ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా తగ్గొద్దు అంటూ ఈయన ఈ సందర్భంగా తెలిపారు.ఇక మీరు ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ వాడండి అంటూ ఈయన అభిమానులకు ఈ సందర్భం గా సూచనలు చేశారు. ఇలా సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.