"కిసీ కా భాయ్ కిసీ కా జాన్" మూవీ బుకింగ్స్ ఓపెన్..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకం గా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . సల్మాన్ ఇప్పటి వరకు కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా ఎన్నో దేశాలలో ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు . ఇది ఇలా ఉంటే తాజాగా సల్మాన్ "కిసీ కా భాయ్ కిసీ కా జాన్" అనే ఫ్యామిలీ ఎంటర్టైలర్ తో కూడిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు .
 


ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ సినిమా యూనిట్ ఈ మూవీ యొక్క బుకింగ్స్ ఓపెన్ అయినట్లుగా అధికారికంగా  ప్రకటించింది .


ఇది ఇలా ఉంటే ఈ ఫ్యామిలీ ప్లేస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన పాత్రలో నటించ గా ... భూమిక చావ్లా కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించింది. టాలీవుడ్ నటుడు జగపతి బాబు ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు . ఈ సినిమాపై హిందీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: