పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితమే యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో "ఓ జి" అనే మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంచింగ్ కూడా అయ్యింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రియాంక అరుణ్ మోహన్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా కనిపించబోతోంది.
ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ యూనిట్ మరి కొన్ని రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ ఈ రోజు నుండి ముంబై లో ప్రారంభం కాబోతోంది. ఈ రోజు నుండి ప్రారంభం కాబోయే ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ కూడా జాయిన్ కాబోతున్నాడు. దానితో ఇప్పటికే పవన్ కళ్యాణ్ ముంబై కి కూడా చేరుకున్నాడు. ఈ రోజు నుండి ఈ చిత్ర బృందం పవన్ కళ్యాణ్ పై సన్నివేశాలను చిత్రీకరించబోతోంది.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాక ముందే ఈ సినిమా నుండి ఒక పోస్టర్ ను మరియు ఒక వీడియోను విడుదల చేసింది. ఈ రెండు కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడం మరియు చాలా డిఫరెంట్ గా ఉండడంతో వీటితోటే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగి పోయాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు ... ఈ మూవీ కి ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అనే టైటిల్ ను పెట్టే ఉద్దేశం లో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.