ఓజీ.. సెట్లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్..!!
వరుస సినిమాలు చేసుకుంటూ ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. గడిచిన మూడు రోజుల క్రితం ఈ సినిమా చిత్రీకరణను ముంబైలో ప్రారంభించారు.తాజాగా ఈ సినిమా సెట్లో పవన్ కళ్యాణ్ అడుగు పెడుతున్న విషయాన్ని నిన్నటి రోజున మేకర్స్ ఒక ఫోటోతో విడుదల చేయడం జరిగింది.. అందులో బ్లాక్ హుడి ధరించి.. కళ్ళద్దాలతో పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా కనిపిస్తూ ఉన్నారు.ఏప్రిల్ 15 నుంచి మొదలైన షెడ్యూల్లో భాగంగా ముంబై మరియు పరిసరాల ప్రాంతాలలో ఈనెల ఆఖరి వరకు ఈ సినిమా షూటింగ్ జరగబోతున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ముఖ్య నటి నటులు కూడా ఇందులో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్ర కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంగీతాన్ని ఎస్ఎస్ తమన్ అందిస్తూ ఉన్నారు. అలాగే అద్భుతమైన సాంకేతిక వర్గంతో పాటు యాక్షన్ ప్రియులను అటు పవన్ కళ్యాణ్ అభిమానులను కూడా ఈ సినిమా అలరించే విధంగా ఉంటుందని నిర్మాత దానయ్య ఎంత నమ్మకంగా తెలియజేయడం జరుగుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది.