వెంకటేష్ మూవీ తో తలపడనున్న నాని..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి వెంకటేష్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికుల కు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . వెంకటేష్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంత మైన సినిమా లలో హీరో గా నటించి ఇప్పటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ సీనియర్ హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ హీరో శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న సైంధవ్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు .


ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది . ఇది ఇలా ఉంటే నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కెరియర్ లో 30 వ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసింది . ఈ మూవీ లో మృనాల్ ఠాకూర్ ... నాని సరసన హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ మూవీ ని తాజాగా డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది .


ఇలా వెంకటేష్ హీరో గా రూపొందిన సైంధవ్ మూవీ కంటే ఒక రోజు ముందు గానే నాని హీరో గా రూపొందుతున్న మూవీ ని విడుదల చేయనున్నారు. ఈ రెండు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నిలకోని ఉన్నాయి. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ రెండు మూవీ లలో ఏ సినిమా ప్రేక్షకులను ఎక్కువగా ఆలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: