పుష్ప: సినిమా వల్ల ఐటి దాడుల్లో.. సుకుమార్..!!
సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసిన వారు ఇప్పుడు దర్శకులుగా పలు సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. అలా మంచి విజయాలను అందుకుంటున్న ఉన్నారు. పుష్ప-2 లో భాగస్వామ్యమైన సుకుమార్ రెమ్యూనరేషన్ గురించి కూడా గత కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ కారణంగానే డైరెక్టర్ సుకుమార్ పైన తాజాగా ఐటి రైడ్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే సుకుమార్ మీదే కాకుండా ప్రముఖ నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని మలమంచిలి,రవిశంకర్ ఇళ్ల పైన కూడా ఐటి రైట్స్ జరిగినట్లుగా సమాచారం.
టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలతో రూ.100 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాలను నిర్మిస్తూ ఉన్నారు. పుష్ప మొదటి భాగానికి రూ.400 కోట్ల రూపాయలు దాకా నిర్మాతలు లాభం పొందినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరిపైన ఐటీ దాడులు నిర్వహించారు అన్నట్లుగా సమాచారం. ఎలాంటి హంగామా లేకుండా కేవలం సైలెంట్ గానే ఆదాయపన్ను శాఖ వారు సూదాలు చేసినట్లుగా తెలుస్తోంది.. ఉదయాన్నే ఐటి అధికారులు రెండు మూడు టీములుగా వెళ్లి ఈ దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి పూర్తి వివరాలు తెలియాలి అంటే ఈ విషయంపై నిర్మాతలు కానీ సుకుమార్ గాని స్పందించాల్సి ఉంది.