ఆ విషయంలో నాగచైతన్య పై మండి పడుతున్న నెటిజన్స్..!!
నాగచైతన్య 2009లో జోష్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు నాగచైతన్య. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టగా అక్కడ ఓ సినిమాలో అతిథి పాత్రలో అయితే నటించాడు. ఇక 2017లో ఏ మాయ చేసావే సినిమాలో నటించగా ఈ సినిమాలో కూడా తన నటనతో మంచి మార్కులు పొందాడు.ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అయితే అందుకుంది. ఇందులో తన మాజీ భార్య సమంత కూడా నటించిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత 100% లవ్, దడ, బెజవాడ, ఆటోనగర్ సూర్య, మనం, ఒక లైలా కోసం, ప్రేమమ్ అలాగే రారండోయ్ వేడుక చూద్దాం ఇలా పలు సినిమాలలో నటించగా చాలా వరకు మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఇక కొన్ని సినిమాలు మాత్రం చాలా తక్కువగా గుర్తింపుని అయితే ఇచ్చాయి.ఇక మంచి హోదాలో ఉన్న సమయంలో నాగచైతన్య.. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరు పలు సినిమాలలో కూడా నటించారు. టాలీవుడ్ లో ఈ జంట చూడముచ్చటగా అయితే కనిపించింది. కానీ అంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు విడాకుల పేరుతో అందరికి షాక్ ఇచ్చారు. విడాకుల తర్వాత ఇద్దరు ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్లుగా అయితే బతుకుతున్నారు. ఇక గత కొన్ని రోజుల నుండి నాగచైతన్య మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో రిలేషన్ షిప్ లో ఉన్నాడని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇదేకాకుండా ఇద్దరు కలిసి ఉన్న సందర్భాలు కూడా బాగా కనిపించాయి. దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ నడుస్తుంది అని అందరూ కూడా అనుకుంటున్నారు. ఇక నాగచైతన్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు ఆయన పెట్టే పోస్టులు కూడా వైరల్ అవుతూ ఉంటాయి.ఆయన ప్రస్తుతం కస్టడీ సినిమాలో నటించగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తూ జనాలను బాగా ఆకట్టుకుంటున్నాడు. అయితే తాజాగా ప్రమోషన్స్ భాగంలో తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో ను పంచుకున్నాడు. ఇక అందులో తను ఒక రెస్టారెంట్ కి వెళ్లి ఫుడ్ మెను కు సంబంధించి ఒక గేమ్ ఆడగా.. తన సినిమా విడుదల కాబోతుంది అని గుర్తుకు చేశాడు. అయితే ఆయన ఎక్కడ కూడా తెలుగులో మాట్లాడినట్లు మాత్రం కనిపించలేదు. మొత్తం ఇంగ్లీష్ భాషనే వాడాడు. దీంతో ఆ వీడియో చూసి చాలామంది మండి పడుతున్నారు.. ఒక తెలుగు హీరోవై ఉండి తెలుగులో మాట్లాడటానికి ఏం పోయేకాలం.. మరి ఇంత ఓవర్ చేస్తున్నావ్ సమంతతో విడిపోయిన తర్వాత బాగా మార్పు వచ్చింది అంటూ రకరకాలుగా అయితే కామెంట్లు పెడుతున్నారు.