మరోసారి అదే తప్పు చేస్తున్న మణిరత్నం !

Seetha Sailaja
ఒకప్పుడు మణిరత్నం సినిమాలు వచ్చాయి అంటే అప్పటి సమైఖ్య ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆ సినిమాలను చూసేవారు. అయితే కొన్ని సంవత్సరాలుగా మణిరత్నం హవా కొద్దిగా మందగించింది. అయినప్పటికీ మణిరత్నం పట్టువదలని విక్రమార్కుడు లా భారీ సినిమాలను తీస్తూనే ఉన్నాడు. ఆమధ్య ఆయనకు కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటిని లెక్క చేయకుండా లేటెస్ట్ గా అతడు తీసిన ‘పొన్నియాన్ సెల్వన్’ మరొక తమిళ ‘బాహుబలి’ అంటూ కోలీవుడ్ మీడియా గత సంవత్సరం ఆకాశానికి ఎత్తేసిన విషయం తెలిసిందే.


ఈమూవీ తమిళనాడులో సూపర్ హిట్ తమిళ ప్రజలకు బాగా పరిచయం ఉన్న చోళుల చరిత్ర కావడంతో ఆమూవీని కోలీవుడ్ ప్రేక్షకులు విపరీతంగా చూసారు. అయితే ఆమూవీ తెలుగు డబ్బింగ్ ఇక్కడ ఫ్లాప్ అయింది. వాస్తవానికి ఈసినిమా పబ్లిసిటీ తెలుగు రాష్ట్రాలలో పెద్దగా చేయలేదు. దీనితో పబ్లిసిటీ లోపం కూడ ఒక కారణం అయి ఉండవచ్చు అని అనుకున్నారు అంతా. ఇప్పుడు ఈ నెలాఖరుకు ఈసినిమాకు సంబంధించిన ‘పొన్నియన్ సెల్వెన్’ పార్ట్ 2 విడుదలకాబోతోంది.

అయితే ఈ సీక్వెల్ కు కూడ తెలుగు రాష్ట్రాలలోని సినిమా అభిమానులలో ఎటువంటి క్రేజ్ ఏర్పడటంలేదు. దీనికితోడు ఈమూవీతో పాటు విడుదల అవుతున్న అఖిల్ ‘ఏజెంట్’ పై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ మణిరత్నం తన సీక్వెల్ కు సంబంధించిన పబ్లిసిటీ తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు మొదలుపెట్టకపోవడంతో మణిరత్నం మరొకసారి తప్పు చేస్తున్నాడా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.


తమిళ చరిత్రను తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. దీనికితోడు నేటితరం ప్రేక్షకులలో చాలామందికి చరిత్ర పట్ల అవగాహన లేదు. ఈ పరిస్తితులమధ్య తమిళనాడులో ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 2 పై కూడ తమిళ ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ కొనసాగుతోంది. అయితే ఈమూవీ బాలీవుడ్ లో కూడ క్రేజ్ అంతంతమాత్రంగానే ఉండటంతో ఈమూవీ పేరుకు పాన్ ఇండియా మూవీ కానీ వాస్తవానికి తమిళ సినిమాగానే మారిపోతుందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..  




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: