తమిళ
సినిమా ఇండస్ట్రీ నుండి విడుదలకు రెడీగా ఉండి భారీ అంచనాలు కలిగి ఉన్న సినిమాలలో ఒకటి "పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2". మొత్తంగా రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ
సినిమా యొక్క మొదటి భాగం పోయిన సంవత్సరం భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళం ,
హిందీ భాషలలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా తమిళ ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించినప్పటికీ ఇతర భాషా ప్రేక్షకులను మాత్రం ఏ రేంజ్ లో అలరించడంలో కాస్త విఫలం అయింది. ఇది ఇలా ఉంటే ఈ భారీ బడ్జెట్
మూవీ కి మణిరత్నం దర్శకత్వం వహించగా ... చియాన్
విక్రమ్ , కార్తీ ,
జయం రవి , ఐశ్వర్యా రాయ్ ,
త్రిష , శోభితా
ధూళిపాల ఈ
మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఏ ఆర్ రెహమాన్ ఈ
మూవీ కి సంగీతం అందించాడు.
ఈ
మూవీ యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ... ఈ
మూవీ యొక్క రెండవ భాగంపై
తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ
సినిమా రెండవ భాగంపై మిగతా ప్రాంతాల ప్రేక్షకులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ యొక్క రెండవ భాగాన్ని ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ
సినిమా బృందం ఈ
మూవీ ప్రమోషన్ లను నిర్వహిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ని "యూ ఎస్ ఏ" లో ఇప్పటివరకు ఏ
తమిళ సినిమా కూడా రిలీజ్ కానీ రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా "యూ ఎస్ ఏ" లో ఈ
మూవీ ని 1100 షో స్ ప్రీమియర్స్ వెయ్యనున్నట్లు తెలుస్తోంది. ఇలా పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 సినిమాను "యూ ఎస్ ఏ" లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.