OTT; అప్పుడే ఓటేటిలోకి వచ్చేస్తున్న దసరా.. ఎప్పుడంటే..?

Divya
నాచురల్ స్టార్ నాని ,కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరా. ఈ సినిమాని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. మార్చి 30వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా ఈ సినిమా రూ .100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాని కెరియర్ లోనే ఈ సినిమా అత్యధిక బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిందని చెప్పవచ్చు.ముఖ్యంగా ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాగ్ క్లైమాక్స్ తెగ నచ్చేయడంతో సినీ సెలబ్రిటీలు కూడా నాని నటన పైన ప్రశంసలు కురిపించారు.



ముఖ్యంగా చిరంజీవి ,అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు సైతం దసరా సినిమాను మెచ్చుకోవడంతో పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా బాగానే ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్ రూ.22 కోట్ల రూపాయలకు ఈ సినిమా డిజిటల్ రైట్స్ను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. కాగా ఇటీవల మే 30వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రిమింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మేరకు సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 27వ తేదీన ప్రసారం కాబోతున్నట్లు సమాచారం.


అయితే హిందీ సినిమా వర్షన్ హక్కులను మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వెలుపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో కీర్తి సురేష్ మాస్ డాన్స్ సాంగ్స్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక ఆమధ్య కొన్ని డిలీట్ సన్నివేశాలను కూడా యూట్యూబ్లో విడుదల చేయగా మంచి వ్యూస్ ను కూడా రాబట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: