"రామబాణం" సినిమా ట్రైలర్ విడుదల సమయాన్ని ప్రకటించిన మూవీ బృందం..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్న హీరోలలో గోపీచంద్ ఒకరు. గోపీచంద్ తన కెరియర్ లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. కాకపోతే గోపీచంద్ ఎక్కువ శాతం మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లతో విజయాలను అందుకోవడంతో ఈ హీరో కు మాస్ జనాల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఇది ఇలా ఉంటే ఆఖరుగా గోపీచంద్ "పక్కా కమర్షియల్" మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం విడుదల అయ్యి ప్రేక్షకులను నిరాశపరిచింది. తాజాగా గోపీచంద్ "రామబాణం" అనే సినిమాలో హీరో గా నటించాడు.
 


డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శ్రీ వాసు దర్శకత్వం వహించగా ... జగపతి బాబు ... కుష్బూ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.


ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ ట్రైలర్ విడుదల సమయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ రోజు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే లక్ష్యం ... లౌక్యం మూవీ ల తర్వాత గోపీచంద్ ... శ్రీ వాస్ కాంబినేషన్ లో రూపొందిన మూవీ కావడంతో రామబాణం మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ మూవీ ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: