టాలీవుడ్ యంగ్
హీరో న్యాచురల్ స్టార్ నాని రీసెంట్ గా
దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.కొత్త
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేష్
హీరోయిన్ గా నటించి ఎంతగానో మెప్పించింది.అసలు మునుపెన్నడూ కనిపించని ఊర
మాస్ పాత్రలో
నాని నటించి మెప్పించాడు. పాన్
ఇండియా రేంజిలో విడుదల అయిన ఈ
సినిమా అన్ని భాషల్లో మెప్పించలేకపోయినా తెలుగులో మాత్రం మంచి లాభాలని తెచ్చిపెడుతుంది. ఈ
సినిమా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్టు సమాచారం తెలుస్తుంది.ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.
నాని కెరీర్ లో 30వ మూవీగా ఈ
మూవీ రాబోతుంది. ఇప్పటికే ఈ
సినిమా నుంచి గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియో ద్వారా
మూవీ థీమ్ ఏంటో వివరించారు.ఇది
తండ్రి కూతురుకి మధ్య జరిగే కథ అని తెలుస్తోంది.
ఇక ఈ
సినిమాలో సీతారామంతో ఎంతగానో ఆకట్టుకున్న
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్
హీరోయిన్ గా నటిస్తోంది.ఇదిలా ఉంటే ఈ
సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు బాగా చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమాకి హాయ్
నాన్న అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో
కియారా ఖన్నా
నాని కూతురిగా నటిస్తోంది.ఇక ఈ
సినిమా కూడా మజిల్,
నిన్ను కోరి లాంటి సెన్సిబిల్ హిట్ అవుతుందని
నాని ఫ్యాన్స్ బావిస్తున్నారు. ఈ సినిమాతో
నాని ఖచ్చితంగా మరో గుర్తుండిపోయే హిట్ కొట్టడం ఖాయం అని అంటున్నారు
నాని ఫ్యాన్స్. ఇక ఈ సినిమాకు కూడా శౌర్యవ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ
సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ ను త్వరలోనే ఇవ్వనున్నారు మేకర్స్.ఈ సినిమాతో
నాని ఎలాంటి హిట్ ని అందుకుంటాడో చూడాలి. ఈ
సినిమా కూడా
దసరా లాగా పెద్ద హిట్ అయితే
నాని రేంజ్ మరింత పెరగడం ఖాయం.