అఖిల్ "ఏజెంట్" మూవీ ట్రైలర్ పై స్పందించిన సూపర్ స్టార్ మహేష్ బాబు..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్ తాజాగా "ఏజెంట్" అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తో సాక్షి వైద్య తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించగా ... మమ్ముట్టి ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.


ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను మరియు పాటలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ లో యాక్షన్స్ సన్నివేషాలు అద్భుతంగా ఉండడం ... అలాగే అఖిల్ నటన కూడా ఈ ట్రైలర్ లో సూపర్ గా ఉండడంతో ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఏజెంట్ మూవీ ట్రైలర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదిక గా స్పందించాడు.


సోషల్ మీడియా వేదికగా ఏజెంట్ ట్రైలర్ గురించి మహేష్ స్పందిస్తూ ... ఏజెంట్ మూవీ ట్రైలర్ లో అఖిల్ అక్కినేని బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అలానే యాక్టింగ్ తో పాటు దర్శకుడు సురేందర్ రెడ్డి టేకింగ్ , నిర్మాత అనిల్ సుంకర భారీ నిర్మాణ విలువలు అదిరిపోయాయని అన్నారు. అలాగే తప్పుకుండా ఏజెంట్ మంచి విజయం అందుకోవాలని కోరుతున్నానని మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  మహేష్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: