మళ్ళీ పెళ్లి: ఇంట్రెస్టింగ్ టీజర్.. హిట్ అయ్యేట్టుందిగా?
నరేష్ ఇంకా పవిత్రా కలిసి నటిస్తోన్న ఈ సినిమాకు ‘మళ్లీ పెళ్లి’ అని టైటిల్ ని ఫిక్స్ చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేశారు.నరేష్ ఇంకా పవిత్ర జంటగా నటిస్తున్న ఈ సినిమాకి ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతోపాటు.. కన్నడలో కూడా ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ ని చూస్తే.. నటుడు నరేష్ నిజ జీవితంలో జరిగిన సంఘటనలే వెండితెరపై చూపించబోతున్నారు. అంటే నరేష్ తన జీవిత కథనే గా తీసుకువస్తున్నట్లుగా చూస్తుంటే తెలుస్తోంది. ఈ సినిమాలో నరేష్ భార్యగా వనితా విజయ్ కుమార్ కనిపించారు. తాను మోసపోయానని వనితా మీడియా ముందు మాట్లాడుతుండడంతో ఈ టీజర్ ప్రారంభమైంది.అయితే అందులో తన భర్త మృగం అని ఆమె చెప్పగా.. నరేష్.. పవిత్రా లోకేష్ సంతోషంగా ఉండడం కనిపిస్తుంది.ఈ మూవీని విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు.