ఆ సినిమా సక్సెస్ అవ్వడం తో ఎమోషనల్ అయిన సాయి ధరమ్ తేజ్...!!

murali krishna
సాయిధరమ్ తేజ్ తాజాగా విరూపాక్ష  అనే సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను అయితే సొంతం చేసుకుంది.

ఇలా ఈ సినిమాకు మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ రావడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారనీ తెలుస్తుంది..ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులతో కలిసి థియేటర్లో సినిమా చూసినటువంటి సాయి ధరమ్ తేజ్ సినిమా పూర్తి అవ్వగానే థియేటర్ బయటకు వచ్చి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారనీ తెలుస్తుంది..

ఈ క్రమంలోనే డైరెక్టర్ కార్తీక్ దండు ను ఒక్కసారిగా హగ్ చేసుకుని మరి కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. సాయిధరమ్ తేజ్ కి ఈ సినిమా ఎంతో స్పెషల్ అనే చెప్పవచ్చు.రెండేళ్ల క్రితం ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఆ ఇబ్బందుల నుంచి బయటపడి తిరిగి సినిమాలలోకి అయితే వచ్చారు.సినిమా షూటింగ్ సమయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్న  కానీ లెక్కచేయకుండా తన లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేశారట.సినిమా షూటింగ్ పూర్తి అయిన ఆయన విశ్రాంతి తీసుకోకుండా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా తన భుజాన వేసుకొని వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాకు కావలసిన స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇలా సినిమా కోసం ఎంతో కృషి చేసిన సాయి ధరమ్ తేజ్ కి ఈ సినిమా మంచి ఫలితాన్ని అందించిందని చెప్పాలి. ఇలా రెండు సంవత్సరాలు ఈయన అనుభవించిన ఆ నరకానికి సరైన ఫలితం దక్కడంతో ఒక్కసారిగా హీరో ఎమోషనల్ అయ్యారనీ తెలుస్తుంది.ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్లను కూడా రాబడితే సాయిధరమ్ కెరియర్ లో ఈ సినిమా నిలిచిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: