యంగ్ టైగర్
ఎన్టీఆర్,
కొరటాల శివ కాంబినేషన్లో భారీ పాన్
ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
తారక్ సరసన జాన్వికపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో
బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్
అలీ ఖాన్ విలన్ కనిపించనున్నాడు.
ఎన్టీఆర్ తో పాటు తాజాగా సైఫ్
అలీ ఖాన్ సైతం షూటింగ్లో జాయిన్ అయ్యాడు. ఈ సినిమాలో
కొరటాల శివ సైఫ్
అలీ ఖాన్ కోసం ఓ పవర్ఫుల్ రోల్ డిజైన్ చేశారట. తాజాగా సైఫ్
అలీ ఖాన్ ఎన్టీఆర్ పోరాటాల
శివ గురించి మాట్లాడుతూ పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు.. 'కొరటాల
శివ తనకు మూడు గంటల పాటు ఈ స్క్రిప్ట్ వినిపించారని, ముఖ్యంగా తన రోల్ గురించి ఎంతో అద్భుతంగా చెప్పారని సైఫ్
అలీ ఖాన్ చెప్పుకొచ్చాడు.
అంతేకాదు ఈ
సినిమా కోసం
కొరటాల శివ అద్భుతమైన ప్లానింగ్, సెటప్ చేశారని పేర్కొన్నాడు. ఇక
ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ..'తారక్ వర్క్ విషయంలో ఎంతో ఫ్యాసినేట్ గా ఉన్నాడని చెప్పాడు. ఇక ప్రస్తుతం పాన్
ఇండియా ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పానని సైఫ్
అలీ ఖాన్ పేర్కొన్నాడు. ఇక ఈ
సినిమా కోసం సైఫ్
అలీ ఖాన్ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ
సినిమా కోసం ఏకంగా
హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ
సినిమా వచ్చేఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదల కానుంది.
ఇక ఈ సినిమాతోనే జాహ్నవి కపూర్
హీరోయిన్ గా
టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. ఇక సినిమాలో
ఎన్టీఆర్ జాన్వి కపూర్ ల మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా స్పెషల్ గా ఉండబోతున్నాయట.
టాలీవుడ్ లో ఈ
మూవీ కెరీర్ పరంగా జాహ్నవికాపూర్ కి కచ్చితంగా ప్లస్ అవుతుంది అని అంటున్నారు. ఈ
సినిమా కనుక హిట్ అయితే
జాన్వి కపూర్ కి
టాలీవుడ్ లో వరుస ఆఫర్లు రావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఇక హై వోల్టేజ్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను
ఎన్టీఆర్ ఆర్ట్స్, యసుదా ఆర్ట్స్ బ్యానర్లపై
కళ్యాణ్ రామ్, మిక్కిలి నేను
సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కోలీవుడ్ మ్యూజిక్
డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నాడు...!!