టాలీవుడ్ యంగ్
హీరో అక్కినేని
అఖిల్ నటిస్తోన్న లేటెస్ట్
సినిమా ఏజెంట్. ఈ
సినిమా టీజర్ అండ్ ట్రైలర్ తో ఇప్పటికే
అఖిల్ తన హవా చూపించడం స్టార్ట్ చేశారు.ఏజెంట్‌గా మారి సూపర్ గా అయి ఇరగదీస్తున్నారు.ఇక తన యాక్షన్, స్టామినా అలాగే తన ఎనర్టీ ఎంటో.. దిమ్మతిరిగే రేంజ్లో అందరికీ చూపించేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన రెండు నిమిషాల ఇరవై సెకండ్ల ట్రైలర్ తో.. ఏకంగా యూట్యూబ్‌నే ఒక రేంజిలో షేక్ చేస్తున్నారు.సీనియర్
స్టైలిష్ స్టార్ డైరెక్టర్
సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్
ఇండియన్ ఫిల్మ్ ఈ ఏజెంట్.
అఖిల్ అక్కినేని హీరోగా మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ
మూవీ ఏప్రిల్ 28 వ తేదీన రిలీజ్ కు రెడీ అయిపోయింది. ఇక ఈ క్రమంలోనే ఈ
సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.చూసిన వారందరికీ కూడా గూస్ బంప్స్ వచ్చేలా ఈ ట్రైలర్ చేస్తోంది.
ఇదిలా ఉంటే ఈ
సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు
హీరో అక్కినేని అఖిల్. ఇక తాజాగా
అఖిల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. నేను అక్కినేని వారసుడిగా కంటే కూడా
అఖిల్ గానే ఉండటానికి ట్రై చేస్తాను అని అన్నారు.ఇక నేను కేవలం అక్కినేని వారసుడిగా కంటే,
అఖిల్ గానే ఉండటానికి ఎక్కువ ట్రై చేస్తాను. ప్రేక్షకులు నన్ను ఓన్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీ. అక్కినేని వారసత్వం గురించి ఆలోచిస్తే నేను అదే ముసలోకి వెళ్లిపోతాను. నేను నా సొంత నిర్ణయాలని తీసుకుంటున్నాను.
సక్సెస్ లు వచ్చినా ఇంకా ఫెయిల్యూర్ లు వచ్చినా చివరి దాకా నాలాగే ఉండేందుకు నేను ప్రయత్నిస్తాను అని చెప్పుకొచ్చాడు అఖిల్.ఇక ఏజెంట్ సినిమాతో
అఖిల్ ఎలాంటి హిట్ ని అందుకుంటాడో చూడాలి.