ఏజెంట్ తర్వాత.. అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో తెలుసా?
అయితే ఎన్నో రోజులుగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమాకు విడుదలకు కొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు ఈ అక్కినేని హీరో. అయితే ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ తర్వాత ప్రాజెక్టు ఎవరితో అన్నది కూడా ప్రస్తుతం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారి పోయింది అని చెప్పాలి. అయితే అఖిల్ ఒక కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట.
అయితే ఏజెంట్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న ఇప్పటివరకు అటు అఖిల్ మాత్రం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతున్న మూవీలో అఖిల్ నటించ బోతున్నాడట. ఒక డెబ్యు దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడట అఖిల్. అనిల్ అనే కొత్త దర్శకుడు అక్కినేని హీరోని డైరెక్ట్ చేయ బోతున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ కి సంబంధించిన చర్చలు ముగిసాయట. అఖిల్ కి కథ నచ్చడం తో ఓకే చెప్పేసాడు అన్నది తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.